English | Telugu
దిల్ రాజు బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!
Updated : Nov 3, 2021
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లి సందD' సినిమాతో యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయినా.. శ్రీలీల మాత్రం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతుంది. ఇప్పటికే రవితేజ సరసన 'ధమాకా' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. అలాగే యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో ఎన్టీఆర్ వరకు పలువురు హీరోల సినిమాల కోసం ఈ బ్యూటీ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.
దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ హీరోగా పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఆశిష్ హీరోగా దిల్ రాజు రెండో సినిమాను కూడా ప్లాన్ చేశారని అంటున్నారు. ఆశిష్ మొదటి సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ను రంగంలోని దింపిన ఆయన.. రెండో సినిమాకి కూడా మరో క్రేజీ హీరోయిన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీలను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాలను కూడా తెలుపుతూ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
మరోవైపు ఆశిష్ హీరోగా మూడో సినిమా కూడా లైన్ లో ఉందని.. డానికి 'జై పాతాళ భైరవి' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.