English | Telugu

బాలయ్య సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

లెజెండ్ తరువాత బాలయ్య డైరెక్టర్ సత్యదేవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డోల్ బాజారే డోల్’ అంటూ హైదరాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్‌లో హీరోయిన్ రాధికా ఆప్టేతో కలిసి చిందులేస్తున్నాడు. ఈ రోజుతో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తికానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయాలని యూనిట్ ఆలోచిస్తోంది. ఇందులో బాలయ్య పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, గత సినిమాలకు భిన్నంగా ఉంటుందనీ, మాస్ ప్రేక్షకులకు ఇది పసందైన విందు భోజనమని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య-త్రిష తొలి సారిగా జత కడుతున్నారు.