English | Telugu
బాలయ్య- గోపిచంద్ మూవీలో హీరోయిన్ గా త్రిష!!
Updated : Aug 30, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవల రవితేజకు 'క్రాక్' వంటి సూపర్ హిట్ అందించిన గోపిచంద్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్ గా త్రిష ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణ- గోపిచంద్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా నయనతార, శృతి హాసన్, త్రిష వంటి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రిష ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మేకర్స్ త్రిషను సంప్రదించగా మూవీ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో త్రిష గృహిణి పాత్రలో కనిపిస్తుందట. కాగా గతంలో బాలకృష్ణ సరసన త్రిష `లయన్(2015)` మూవీలో నటించింది. ఆరేళ్ళ తర్వాత ఈ జంట మరోసారి సందడి చేయనుందని తెలుస్తోంది.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నారు. త్వరలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పట్టలెక్కనుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసే అవకాశముంది.