English | Telugu

రామ్-బోయపాటి కాంబినేషన్ లో బైలింగ్వల్ మూవీ!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్విభాషా(తెలుగు తమిళ) చిత్రంగా తెరకెక్కుతోంది. అయితే దీని తర్వాత మరో బైలింగ్వల్ మూవీ చేయడానికి రామ్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

రామ్ కోసం బోయపాటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ స్టొరీ రెడీ చేశాడని అంటున్నారు. ఇటీవల రామ్ ని కలిసిన బోయపాటి కథ వినిపించారని.. ఆ కథ నచ్చి రామ్ వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇది తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న.. బోయపాటి సినిమాతో ఆ స్థాయిలో మాస్ ని అలరించాలని భావిస్తున్నారట.

కాగా, బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ' సినిమా చేస్తున్నాడు. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్యతో చేస్తున్న సినిమా కావడంతో అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ తో ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు.