English | Telugu

పవన్ కళ్యాణ్‌తో నందమూరి మోక్షజ్ఞ సెల్ఫీ?

ప్రస్తుతం నందమూరి న‌టసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 సీజన్ నడుపుతున్న సంగ‌తి తెలిసిందే....! ఇందులో భాగంగా ఆయన ఇటీవల ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించే విష‌యం విదిత‌మే. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ బాలయ్యలతో పాటు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా అక్కడే ఉంది. దాంతో ఆమె పవన్ కు వీరాభిమాని అనే చర్చ మొదలయింది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ తాజాగా మరో విశేషం చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చివర్‌లో బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సెట్‌పై సందడి చేశార‌ని సమాచారం.

నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఆయనతో కలిసి ఒక ఫోటో కూడా తీసుకున్నారు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. ఇందులో వాస్తవమే ఉందని ఆ షూటింగ్‌లో ఆన్ లైన్ లో గాని ఆఫ్ లైన్ లో   గాని చూసినవారు లీక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న‌వారు... ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న మ‌రికొంత మంది ఇది నిజ‌మేన‌ని చెబుతూ ఉండ‌టం విశేషం.  ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ విజువల్స్ ఉంటాయా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆ తర్వాత లేదా అంతకుముందే మోక్షజ్ఞ గ్లింప్స్‌ను  సోషల్ మీడియా ద్వారా ఆహా వారు  షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్  గురించి అన్ స్టాప‌బుల్ గా చర్చ సాగుతూనే ఉంది.  సంక్రాంతి కానుకగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 ప‌వ‌న్  ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని,  అందుకు త‌గ్గ‌ట్లుగా  ఆహా వారు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.