English | Telugu
బాలయ్యకు పెళ్లి పాట కావాలంటా....?
Updated : Aug 5, 2013
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెళ్లి పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాట బాలయ్యకు చాలా బాగా నచ్చేసిందట. దాంతో బాలకృష్ణ తన రెండవ కూతురు తేజస్విని వివాహ వేడుకకి కూడా ఒక మంచి పాట చేసి పెట్టమని దేవిని బాలయ్య అడిగినట్లు సమాచారం. బాలయ్య ఇంట్లో ఇప్పటికే పెళ్లి వాతావరణం మొదలయ్యింది. తన కూతురు వివాహ పనులలో బిజీగా బాలయ్య ఉన్నాడు.
దేవిని బాలయ్య అడగడానికి ఓ కారణం కూడా కనిపిస్తుంది. అదేమిటంటే... ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వేడుకకి కూడా ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. కాబట్టి తన కూతురు పెళ్లికి కూడా అంత కంటే అదిరిపోయే పాటను రూపొందించమని దేవిని బాలయ్య అడిగాడని తెలిసింది. దీనికి దేవి కూడా ఓకే చెప్పేశాడట.
అసలు సినిమా పాటలే పండగ చేసుకునే విధంగా ఉండే దేవి పాటలు... మరి నిజంగా పెళ్లి పండగ పాట అంటే ఇంకెంత ఆదరగోడతాడో చూడాలి మరి.