English | Telugu
జైలర్-2 లో బాలయ్య, సూర్య..!
Updated : Feb 18, 2025
రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' సినిమా 2023 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'జైలర్-2' రూపొందుతోంది. సీక్వెల్ హైప్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తున్నాయి.
'జైలర్-2'లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో మెరవనున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నట్లు సమాచారం.
'జైలర్-2'లో బాలకృష్ణ, ఎస్.జె.సూర్య భాగమైతే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి అనడంలో సందేహం లేదు. రజిని, బాలయ్య కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక సూర్య కూడా విలన్ గా తనదైన నటన, ప్రత్యేక డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. అలాంటి సూర్య.. రజినీని ఢీ కొడితే ఆ కిక్కే వేరు.