English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ లో బికినీలో తమన్నా

అల్లు అర్జున్ "బద్రీనాథ్" లో బికినీలో తమన్నా తన అందాలను ఆరబోసిందట. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలో హీరోయిన్ తమన్నా స్టిల్స్ తడిబట్టల్లో వేడి వేడి అందాలను వాడిగా మరింత వేడిగా అందించింది. ఈ స్టిల్స్ కూడా ఇటివల విడుదలయ్యాయి. అయితే అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలో హీరోయిన్ తమన్నా భాటియా బికినీలో ప్రేక్షకులకు కనిపించనుందట.

ఈ బికినీ సీన్ లో నటించే సమయంలో తమన్నా భాటియా ఒక్క స్టిల్ ఫొటో గ్రాఫర్ కూడా ఆ రోజు లొకేషన్ లో ఉండకూడదని దర్శకుడు వినాయక్ కు ఒక కండిషన్ పెట్టిందట. బికినీ సీన్ లో తమన్నా అందాలను చూడటానికి రెండు కళ్ళూ చాలవని అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనీ అంటున్నారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా జూన్ పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభిస్తోంది.