English | Telugu
బాబాయికి అబ్బాయి అడ్డు అవుతాడా?
Updated : Mar 26, 2014
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం,విశాఖపట్నం. మార్చి 27, 2014న సాయంత్రం 4 గంటలకు పవన్ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చిరు కుటుంబానికి, పవన్ కు మధ్య కొంచెమైన అభిమానం ఉందని అందరు అనుకున్నారు. కానీ ఈ ఇరువురి మధ్య రచ్చ మొదలైంది.
రాంచరణ్ పుట్టినరోజు మార్చి 27. తన పుట్టినరోజుని ఘనంగా అభిమానుల సమక్షంలో జరుపుకోవాలని చరణ్, ఇప్పటికే తన అభిమానులకు తెలిపాడని తెలిసింది. దాంతో బ్లడ్ బ్యాక్, ఐ బ్యాంక్ ప్రదేశాలలో చరణ్ తన అభిమానులను కలిసి తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. అయితే పవన్ సభకు వస్తున్న అశేష అభిమానులను అడ్డుకోవడానికే మెగా కుటుంబం కావాలనే ఇలా చేస్తుందని కొందరు అంటున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం అలాంటిదేమీ లేదని ఖండిస్తున్నారు.
అయిన పవర్ స్టార్ ప్రసంగానికి ఎన్ని అడ్డంకులు వచ్చిన కూడా అభిమానులు ఆగిపోయే పరిస్థితిలో లేరు. చూద్దాం మరి మెగా కుటుంబం కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుందో.