English | Telugu

ప్రభాస్ అతిగా బాధ పడ్డ వేళ...

బాహుబలి రెండు పార్టులు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ దుందుభి మోగించడంతో సినిమా కి దాదాపు ఐదేళ్లు శ్రమపడిన టీం మొత్తం రిలాక్స్ అయింది. మనకి స్క్రీన్ మీద అద్భుతాలే కనిపించాయి, కానీ ఇంకో యాంగిల్ లో చూస్తే, వాళ్ళు పడిన శ్రమ కనిపిస్తుంది. ఒక సినిమా కోసం ఇన్నేళ్లు కష్టపడడం మాములు విషయం కాదు. అంతటి డెడికేషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. రాజమౌళి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఇప్పట్లో బాహుబలి లాంటి భారీ సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంతలా అలసిపోయాడో మనం అర్ధం చేసుకోవచ్చు. అయిదు సంవత్సరాలు వెచ్చించిన ప్రభాస్, రానా గొప్పవాళ్ళు. అంత డబ్బులు పెట్టి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకున్న నిర్మతలు గొప్పవాళ్ళు. రాజమౌళి కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరు స్థాయి మించి శ్రమ పడ్డారు... కాబట్టి వాళ్ళందరూ గొప్పవాళ్లే. బాహుబలి రెండు పార్ట్ లు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరు వీళ్ళ గొప్పదనం గురించే మాట్లాడుతున్నారు.

కానీ, ఒక వేళ సినిమా రిజల్ట్ తారుమారయుంటే, పరిస్థితులు ఎలా ఉండేవో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ దాదాపు ఇలాంటి అయోమయ పరిస్థితినే ఎదుర్కొన్నాడు. బాహుబలి మొదటి భాగం విడుదలయినప్పుడు మొదట తెలుగులో నెగటివ్ టాక్ వచ్చింది. అంచనాలని అందుకోలేదని విమర్శలు రావడంతో సినిమా గట్టెక్కుతుందా లేదా అనే భయం తనలో ఉండిందని ప్రభాస్ చెప్పారు. ఏంటి రెండేళ్లు తామంతా పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరేనా అని ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదని వివరించారు. అయితే, లక్కీ గా హిందీ వెర్షన్ పాజిటివ్ టాక్ రావడం... మెల్లిగా తెలుగులో కూడా పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పుకొచ్చాడు ప్రభాస్. నిజమే కదండీ, కష్ట పడిన దానికి తగ్గ ఫలితం దక్కితేనే కదా, ఎవరికయినా తృప్తి ఉండేది. అది ప్రభాస్ అయినా వేరే ఇంకెవరో అయినా!