English | Telugu

కాటమరాయుడు ఎందుకు చూడాలి

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మార్నింగ్ షో పడటంతో ఫ్యాన్స్ ఇప్పుడే ధియేటర్లలోంచి బయటకు వస్తున్నారు. అయితే అల్రెడీ వీరం పేరుతో తమిళ్‌లో ఒకసారి, వీరుడొక్కడే పేరుతో తెలుగులో మళ్లీ ఇప్పుడు పవన్‌ కాటమరాయుడుగా వచ్చాడు. మూడు సార్లు ఒకే కథను ఏం చూస్తాం అని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే పవన్ తన మార్క్ నటనతో తమిళ వీరాన్ని మైమరిపించాడట. అసలు కాటమరాయుడు ఎందుకు చూడాలంటే అంటూ కొందరు అభిమానులు చెబుతున్నా కొలమానాలు ఇవే.

1. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫి సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్
2. డైరెక్టర్ డాలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీ ఆడియాన్స్‌కి సరిపడే‌ అన్ని అంశాలు ఉంటాయని చెప్పారు..
3. పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు బాగా పేలాయట. ఫైట్స్ , డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రధానంగా జివ్వు..జివ్వు సాంగ్‌లో అదిరిపోయాయట.
4. పవన్ కళ్యాణ్ తన పాత్రలో మంచి, చెడు ఉండే రెండు రకాల క్యారెక్టర్లు అదే ఈజ్‌తో చేశాడట.
5. శృతీహాసన్ గ్లామర్ సినిమాకు ఇంకో అతిపెద్ద అసెట్.
6. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమా లెవల్‌ని పెంచుతోంది అంటున్నారు.