English | Telugu

తెలుగులో ఆయుష్మాన్ సినిమాలు...?

 

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఆయుష్మాన్ నటించిన "విక్కీ డోనర్" సినిమాను తెలుగులో ఓ పెద్ద నిర్మాత రీమేక్ చేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఆయుష్మాన్ నటించిన తాజా చిత్రం "బెవకూఫియాన్". ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సంపాదించుకొని, విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ దర్శక, నిర్మాతల కన్ను పడింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం పలువురు తెలుగు దర్శక,నిర్మాతలు పోటీ పడుతున్నారని తెలిసింది. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే త్వరలోనే ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. చూద్దాం... టాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ ఎంతవరకు ఫలిస్తుందో.