English | Telugu
అసెంబ్లీరౌడీ రీమేక్ టైటిల్ ఇదేనా?
Updated : Jul 17, 2013
మోహన్ బాబు, దివ్య భారతి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం "అసెంబ్లీ రౌడీ". బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మోహన్ బాబును మరో మెట్టు స్థాయిని పెంచింది. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని త్వరలోనే రీమేక్ చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో హీరోగా మంచు విష్ణు నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి "అసెంబ్లీ రౌడీ" వీడికి తిరుగులేదు అనే క్యాప్షన్ తో టైటిల్ ను మోహన్ బాబు ప్రొడక్షన్ సంస్థ అయినటువంటి 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ వారు రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. మరి ఈ చిత్ర రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.