Read more!

English | Telugu

ఆ బాబు నా కొడుకు కాదు - బన్నీ

 


సినిమాలు, సినిమా ఫస్ట్‌లుక్ లకు క్రేజ్ ఎంత వుందో సెలబ్రెటీ పిల్లల ఫస్ట్‌లుక్‌ కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ క్రేజ్‌ని వాడుకోడానికి పలు వెబ్ సైట్లు, టీవీ చానల్స్ ప్రయత్నిస్తునే వుంటాయి. కొన్ని సార్లు ఎవరి పిల్లలనో కూడా ఫలానా సెలబ్రెటీ పిల్లలంటూ ప్రచారం చేసేస్తుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్ కూతురు ఈమె అంటూ రకరకాల ఫోటోలు వెబ్ మీడియాలో సర్‌క్యులేట్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరో విషయంలోను అలాంటి ప్రచారం మొదలైంది.


అల్లు అర్జున్ ఈ మధ్యే ఒక కొడుకుకి తండ్రయ్యాడు. ఆ బాబు ఫోటో ఇదే నంటూ వెబ్ మీడియాలో ఒక పిక్ సర్‌క్యులేట్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ భార్య ఒక బాబుని ఎత్తుకుని వుంది. ఆ బాబు బన్నీ కొడుకేనంటూ హడావిడి మొదలైంది. దీనిపై బన్నీ స్పందించి, ఆ ఫోటోలో స్నేహతో వున్నది వారి అబ్బాయి కాదని, తమ అల్లుడు అని క్లారిటీ ఇచ్చాడు. ఆ ఫోటోని సర్‌క్యులేట్ చేయటం ఆపమని రిక్వెస్ట్ చేశాడు.


అయితే బన్నీ తన కొడుకు ఆయాన్ చిత్రం మాత్రం ఇంకా బయటపెట్టలేదు. చూస్తుంటే,  బన్నీ కొడుకుని చూడాలనే కోరికతోనే ఎవరో ఈ ఫోటోలు సర్‌క్యులేట్ చేశారేమో అని అనిపిస్తుంది. జూనియర్ అర్జున్ ని చూడాలని అభిమానులు ఆరాటపడటం సహజమే కదా..