English | Telugu

లారెన్స్ ని కాదన్న అనుష్క

అందాల యోగా టీచర్ అనుష్క తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రంలో నటించటానికి అంగీకరించింది.ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నాడట. ఈ విషయం తెలుసుకున్న అనుష్క తాను తెలుగులో టాప్ హీరోయిన్ కనుక తమిళంలో కూడా టాప్ హీరోయిన్ కావాలనుకుంటున్నాననీ, అందుకని తమిళంలో టాప్ హీరో ఉంటేనే ఈ చిత్రంలో తాను హీరోయిన్ గా నటిస్తాననీ, అదే రాఘవ లారెన్స్ హీరోగా ఉంటే నటించననీ ఆ చిత్ర నిర్మాతతో అందట. మరి తేలుగులో లారెన్స్ హీరోగా నటిస్తే ఫరవాలేదా అనడిగితే ఇక్కడ లారెన్స్ కి కాస్తో కూస్తో ఓక ఇమేజ్‍ అంటు ఉందని ఆమే ఆ నిర్మాతతో అందట.మరి ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ తన సినిమాలోంచి అనుష్కను తీసేస్తాడో లేక తన స్థానంలో మరో హీరోని పెట్టి సినిమా తీస్తాడో చుడాలి.