English | Telugu
`పుష్ప`లో మరో హీరోయిన్?
Updated : May 22, 2021
`అల వైకుంఠపురములో` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం `పుష్ప`. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో `నేషనల్ క్రష్` రష్మికా మందన్న నాయికగా నటిస్తుండగా.. మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని ఒకే భాగంగా రిలీజ్ చేయాలనుకున్న సుక్కు అండ్ టీమ్.. స్టోరీలో ఉన్న స్పాన్ కారణంగా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా కొన్ని పాత్రల నిడివి పెరిగితే.. మరికొన్ని కొత్త పాత్రలు పుట్టుకొస్తున్నాయి. అలా.. `పుష్ప` సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ క్యారెక్టర్ కూడా యాడ్ అవుతోందట. ఈ నేపథ్యంలోనే.. ఓ నోటెడ్ హీరోయిన్ ని సెకండ్ లీడ్ గా నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.