English | Telugu

ఆలియా భట్ ని వదలని చరణ్.. మధ్యలో సల్మాన్ ఖాన్!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వం లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే 'ఆర్ఆర్ఆర్' మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే.. మరో మూవీలో చరణ్ సరసన ఆలియా భట్ నటించనుందని ప్రచారం జరుగుతోంది.

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌ లు నటించబోతున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ ని శంకర్ కన్ఫామ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

శంకర్‌- చరణ్‌ కాంబినేషన్ లో రానున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.