English | Telugu

పాన్-ఇండియా మూవీలో సాయిప‌ల్ల‌వి?

మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం.. ఇలా న‌టించిన ప్ర‌తీ భాష‌లోనూ నాయిక‌గా త‌న‌దైన ముద్ర‌వేసింది సాయిప‌ల్ల‌వి. మ‌రీముఖ్యంగా.. తెలుగునాట ఎన‌లేని అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకుందీ డాన్సింగ్ సెన్సేష‌న్.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో సాయిప‌ల్ల‌వి ఓ పాన్ - ఇండియా మూవీలో న‌టించ‌బోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఓ సినిమాని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో ధ‌నుష్ కి జంట‌గా సాయిప‌ల్ల‌వి న‌టించ‌బోతోంద‌ని టాక్. శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో `ఫిదా`, `ల‌వ్ స్టోరి` చిత్రాల్లో న‌టించిన సాయిప‌ల్ల‌వి.. ధ‌నుష్ కి జంట‌గా ఇప్ప‌టికే ` మారి 2` చేసింది. ఈ మూడు సినిమాల్లోనూ సాయిప‌ల్ల‌వి చేసిన గీతాలు యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి కూడా. త్వ‌ర‌లోనే ధ‌నుష్ - శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ మూవీలో సాయిప‌ల్ల‌వి ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, సాయిప‌ల్ల‌వి న‌టించిన `లవ్ స్టోరి`, `విరాట‌ప‌ర్వం` చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. మ‌రోవైపు నేచుర‌ల్ స్టార్ నానికి జంట‌గా న‌టిస్తున్న `శ్యామ్ సింగ రాయ్` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.