English | Telugu

య‌ష్‌కి జంట‌గా త‌మ‌న్నా?

`కేజీఎఫ్`తో పాన్ - ఇండియా స్టార్ అయిపోయాడు క‌న్న‌డ హీరో య‌ష్. త్వ‌ర‌లో `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2`తో సంద‌డి చేయ‌నున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఇదిలా ఉంటే.. `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2` త‌రువాత `ముఫ్టీ` ఫేమ్ నార్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ - ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు య‌ష్. ఇందులో నేవీ ఆఫీస‌ర్ గా య‌ష్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందే ఈ సినిమాలో య‌ష్ లుక్స్ స‌రికొత్త‌గా ఉంటాయ‌ని శాండిల్ వుడ్ టాక్.

కాగా, ఈ చిత్రంలో య‌ష్ కి జంట‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌బోతోంద‌ని బ‌జ్. ఇదివ‌ర‌కు `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1`లో ``దోచేయ్`` అంటూ సాగే ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది త‌మ‌న్నా. క‌ట్ చేస్తే.. మూడేళ్ళ త‌రువాత య‌ష్ కి జోడీగా పూర్తిస్థాయి పాత్ర‌లో న‌టించ‌నుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. త్వ‌ర‌లోనే య‌ష్ నెక్స్ట్ మూవీలో త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ప్ర‌స్తుతం త‌మ‌న్నా చేతిలో `సీటీమార్`, `ఎఫ్ 3`, `గుర్తుందా శీతాకాలం`, `మాస్ట్రో` చిత్రాలున్నాయి. అలాగే హిందీలో `బోలే చుడియాన్` సినిమా చేస్తోంది.