English | Telugu
అంజలిని చూసి టైటిల్ ఫిక్స్ చేశారా ??
Updated : Jul 13, 2016
"మున్నా" సినిమాలో ఇలియానాను చూసి ప్రభాస్ "పుట్టగానే పెట్టారా.. పెరిగాక పెట్టారా?" అని ఓ డైలాగ్ ఏస్తాడు. ఇప్పుడు అంజలి కొత్త సినిమా టైటిల్ ను చూస్తే కూడా జనాలకి ఆ తరహాలోనే ఓ డైలాగ్ వేయాలనిపిస్తుంది. "జర్నీ" అనంతరం అంజలి-జయ జంటగా ఓ హారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువాదరూపంలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రెండో షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.
ఈ హారర్ కామెడీ సినిమాకి "బెలూన్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. సినిమా కాన్సెప్ట్ ఏమిటి? అసలు టైటిల్ కి సినిమాకి లింక్ ఏమిటన్న విషయం తెలియదు కాబట్టి.. దర్శకనిర్మాతలు అంజలిని దృష్టిలో ఉంచుకొని ఈ టైటిల్ పెట్టినట్లున్నారు అనుకొంటున్నారు జనాలు.
కెరీర్ స్టార్టింగ్ లో సన్నగా ఉన్న అంజలి ఈమధ్యకాలంలో విపరీతంగా లావెక్కింది. తమిళ తంబిలకు బొద్దుగుమ్మలంటేనే ఇష్టమని అలా తయారయ్యిందనుకోన్నారందరూ. కానీ.. "చిత్రాంగద" సినిమాలో అంజలి స్టిల్స్ చూసినవాళ్ళందరూ "మరీ ఇలా అయిపోయిందేమిటి?" అని వాపోయారు. సో, "బెలూన్" అనే టైటిల్ ప్రెజంట్ అంజలి పర్సనాలిటీకి బాగా సింక్ అయ్యిందని నెటిజన్లు జోకులు వేసుకొంటున్నారు!