English | Telugu

మరో మెగా ఆఫర్ దక్కించుకొన్న కుమారి!

"అలా ఎలా" సినిమాతోనే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన భామ హెబ్బా పటేల్. అయితే.. ఆ సినిమా హిట్టయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత సుకుమార్ నిర్మాణ సారధ్యం వహించి కథ-స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన "కుమారి 21F" చిత్రంలో నటించాక హెబ్బా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. "కుమారి 21F" తర్వాత హెబ్బా స్టార్ డమ్ ఒక్కసారిగా ఆకాశానికి చేరుకుంది. అయితే.. ఆ తర్వాత నటించిన "ఈడోరకం ఆడోరకం" ఒకవిధంగా హెబ్బా కెరీర్ కు నష్టం కలిగించింది. దాంతో అమ్మడు కొన్ని సినిమాల్లోనుంచి తప్పించబడింది.

అయితే.. ఉన్నట్లుండి హెబ్బా కెరీర్ బండి సూపర్ స్పీడ్ అందుకొంది. ప్రస్తుతం మెగాహీరో వరుణ్ తేజ్ సరసన "మిస్టర్"లో సెకండ్ హీరోగా నటిస్తున్న హెబ్బా.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకొందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందట. రకుల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. చూస్తుంటే.. లావణ్య త్రిపాఠిల, రకుల్ ల తర్వాత హెబ్బా కూడా మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుంది!