English | Telugu
పెళ్ళీడుకొచ్చాను నమ్మండి: అఖిల్
Updated : Jul 13, 2016
అక్కినేని నటవారసుడు అఖిల్ సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడానికంటే ముందే ఒకమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయితో తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు వారి ఆంగీకారాన్ని సైతం పొంది విపరీతమైన పబ్లిసిటీ సంపాదించుకొన్నాడు. అయితే.. అఖిల్ అప్పుడే పెళ్ళికి రెడీ అయిపోవడంతో అతని సీనియర్లు రాణా మొన్నామధ్య "నీ వయసెంత బంగారం" అంటూ అఖిల్ పై సెటైర్లు వేశాడు.
దాంతో బాగా హర్ట్ అయిన అఖిల్.. "నేనేం చిన్నపిల్లోడ్ని కాదు" అని చెప్పినా అక్కడ స్టేజ్ మీదున్నవారెవరూ నమ్మలేదు. నిజమే కదా 22 ఏళ్ళ అఖిల్ అప్పుడే పెళ్లి చేసుకొంటానంటే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. కానీ.. అలా పిల్లోడ్లా తనని జనాలు చూడడం ఇష్టం లేని అఖిల్ అర్జెంటుగా ఓ ఫోటోషూట్ చేయించుకొన్నాడు. రెగ్యులర్ డ్రెస్ లో కాకుండా.. ఎలాగో పెళ్ళికి రెడీ అవుతున్నాడు కాబట్టి పెళ్లి బట్టల్లోనే ఫోటోషూట్ చేయించుకొన్నాడు. ఇకనైనా అఖిల్ ను జనాలు "పిల్లడ్లా" చూడడం మానేస్తారేమో చూడాలి!