English | Telugu

బ్ర‌హ్మీ పాట్లు అన్నీ ఇన్నీ కావ‌యా...

టాప్ క‌మెడియ‌న్ గా ద‌శాబ్దాల పాటు సింహాస‌నంలో కుర్చున్నాడు బ్ర‌హ్మానందం. ఆయ‌న లేక‌పోతే సినిమా లేదు.. ఆయ‌న్ని చూడ‌క‌పోతే సినిమాలో కామెడీనే లేదు అన్నంత రేంజులో సాగింది బ్ర‌హ్మీ స్టార్ డ‌మ్. సెకండాఫ్‌లో బ్ర‌హ్మీ క్యారెక్ట‌ర్ క్లిక్ అయితే ఆ సినిమా సూప‌ర్ హిట్టే అనేసుకొన్నారు సినీ జ‌నాలు. ఆ సెంటిమెంట్‌ని చాలా సినిమాలు నిజం చేశాయి. ఆ ప్ర‌వాహంలో బ్ర‌హ్మానందం వేయి సినిమాల్ని పూర్తి చేసి సంచ‌ల‌నం కూడా సృస్టించాడు. అయితే గ‌త యేడాది కాలంగా బ్ర‌హ్మానందంకి స‌రైన సినిమాల్లేవు. పెద్ద ద‌ర్శ‌కులంతా కావాల‌ని బ్ర‌హ్మానందాన్ని ప‌క్క‌న పెట్టార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. వాళ్ల‌కు నిర్మాత‌లు కూడా తోడ‌య్యార్ట‌. `బ్ర‌హ్మానందాన్ని ప‌క్క‌న పెడ‌దాం` అంటూ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ ఓ అండ‌ర్ స్టాండింగ్‌కి వ‌చ్చేశార‌ని, అందుకే పెద్ద సినిమాల్లో బ్ర‌హ్మానందం క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు వాళ్ల‌కు హీరోలూ తోడ‌య్యార‌ని తెలుస్తోంది. తెలుగు చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయ‌కులు అని పిలిపించుకొన్న ప్ర‌తీ ఒక్క‌రితోనూ బ్ర‌హ్మానందానికి మంచి రిలేష‌నే ఉంది. చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీ బ్ర‌హ్మానందాన్ని ఎంతో ప్రోత్స‌హించారు. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, ప‌వ‌న్‌లూ అంతే ఇదిగా బ్ర‌హ్మీకి అవ‌కాశాలు క‌ల్పించారు. అయితే ఇప్పుడు కొంత‌మంది హీరోలు కావాల‌నే బ్ర‌హ్మానందాన్ని ప‌క్క‌న పెట్టేశార‌ట‌. `మ‌న సినిమ‌లో బ్ర‌హ్మానందం వ‌ద్దులెండి` అని నేరుగా ద‌ర్శ‌కుల‌కే చెప్పేస్తున్నార‌ని టాక్‌. ద‌ర్శ‌కుడు దూరం పెట్టినా.... హీరోలు కావాల‌నుకొంటే బ్ర‌హ్మానందంని తీసుకోవాల్సిందే. ఇప్పుడు హీరోలే.. ఆయ‌న్ని వ‌ద్దు అనుకొంటుంటే.. బ్ర‌హ్మీ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. డిమాండ్ బాగా ఉన్న‌ప్పుడు బ్ర‌హ్మానందం చేసిన చేష్ట‌లు, సెట్లో ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌.. ఇవ‌న్నీ హీరోలు, ద‌ర్శ‌కులు, ప్రొడ్యూస‌ర్ల‌కు బాధ తెప్పించిందేమో. అందుకే ఇలా రివైంజ్ తీర్చుకొంటున్నారు. పాపం.. మ‌న బ్ర‌హ్మీకి ఎన్ని క‌ష్టాలో చూశారా??