English | Telugu

బ్రోత‌ల్ కేసులో బుక్క‌యిన హాట్ యాంక‌ర్ ఎవ‌రు?

టీవీ యాంక‌ర్లంటే బుల్లి స్టార్ల‌కిందే లెక్క‌. కొంత‌మందైతే వెండి తెర స్టార్ల‌ను, వాళ్ల క్రేజ్‌నీ మించిపోతారు. ఒక్క షో చేశారంటే చాలు ల‌క్ష‌లు వ‌చ్చిప‌డిపోతుంటాయి. దానికి తోడు ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌లో మైకు ప‌ట్టుకొంటే బోలెడ‌న్ని డ‌బ్బులు. ఐటెమ్ గీతాల‌ని, వ్యాంపు త‌ర‌హా పాత్ర‌ల‌ని ఆదాయ మార్గాలు చాలా ఉంటాయి. అయితే వీటితో స‌రిపెట్టుకోక కాసుల కోసం కక్కుర్తి ప‌డుతుంటారు కొంత‌మంది. అందుకే చీక‌టి వ్య‌వ‌హార‌ల్లో త‌ర‌చూ కొంత‌మంది యాంక‌ర్ల పేర్లు వినిపిస్తుంటాయి. ఈసారీ ఓ హాట్ యాంక‌ర్ వార్త‌ల్లో నిలిచింది. హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ రిసార్ట్స్ లో ఓ హాట్ యాంక‌ర్ అడ్డంగా దొరికిపోయింది. బ్రోత‌ల్ కేసులో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ముగ్గురు విటుల‌తో క‌ల‌సి రొమాన్స్ చేస్తుండ‌గా ఆ యాంక‌ర్ ని అరెస్ట్ చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఓ టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొన్న ఆ యాంక‌ర్ భామ ఇటీవ‌ల కొన్ని సినిమాల్లోనూ క‌నిపించింది. దాంతో.. ఆ యాంక‌ర్ ఎవ‌ర‌న్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ టాలీవుడ్‌లో సాగుతుంది. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ జ‌రిపి... విడుద‌ల చేశార‌ని, అయితే ఈ విడుద‌ల వెనుక పెద్ద‌ల హ‌స్తం కూడా ఉంద‌న్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఇలాంటి వ్య‌వ‌హారాలు బుల్లితెర స్టార్ల‌పై ఓ మ‌చ్చ‌లా మిగిలిపోయే ప్ర‌మాదం ఉంది. పైస‌ల‌పై వ్యామోహంతో ఇలాంటి అడ్డ‌దార్లు తొక్కాల‌నుకొంటున్నవాళ్లు ఇక‌నైనా స‌రైన దారిలో న‌డుస్తారేమో చూడాలి.