English | Telugu
'ఖిలాడి' అత్తగా అనసూయ?
Updated : Feb 3, 2022
రవితేజ టైటిల్ రోల్ పోషించిన 'ఖిలాడి' మూవీ ఈనెల 11న థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రమేశ్‌వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో కనిపించే ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో అనసూయ కూడా ఓ ప్రధాన పాత్ర చేసింది. Also read:వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి రియాక్షన్!
లేటెస్ట్ ఇండస్ట్రీ బజ్ ప్రకారం అనసూయ హీరోయిన్లలో ఒకరికి అమ్మగా కనిపిస్తుందట. అంటే రవితేజకు అత్త క్యారెక్టర్ అన్నమాట. ఆమె క్యారెక్టర్ పేరు చంద్రకళ అని ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు. 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఇప్పుడు మరోసారి హీరోకి అత్తగా దర్శనం ఇవ్వనుంది. Also read:'ఊ అంటావా' పాట కోసం కంటి ఆపరేషన్ వాయిదా!
ఇప్పటికే 'ఖిలాడి' థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు మంచి ధరకు అమ్ముడవడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. 'ఖిలాడి' మూవీతో పాటు 'ఆచార్య', 'పక్కా కమర్షియల్', 'రంగమార్తాండ' చిత్రాలు, మలయాళంలో మమ్ముట్టి సినిమా 'భీష్మపర్వమ్' కూడా అనసూయ లిస్టులో ఉన్నాయి.