'ఊ అంటావా' పాట కోసం కంటి ఆపరేషన్ వాయిదా!
on Feb 2, 2022

'ఊ అంటావా మావా' సాంగ్ కోసం తన కంటి ఆపరేషన్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, ఆ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చిన గణేశ్ ఆచార్య వెల్లడించాడు. సమంత, అల్లు అర్జున్ పర్ఫామ్ చేసిన ఆ సాంగ్ గ్లోబల్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీ డిసెంబర్ 17న రిలీజైంది. "డిసెంబర్ రెండునో, మూడునో అల్లు అర్జున్ నాకు కాల్ చేసి, ఓ పాట చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంత తక్కువ టైమ్‌లో చెబితే ఎట్లా అనీ, మరుసటి రోజు నాకు కాటరాక్ట్ సర్జరీ ఉందనీ చెప్పాను. కానీ 'పుష్ప' నిర్మాతలు నా డాక్టర్‌తో మాట్లాడి, ఆ సర్జరీ డేట్‌ను వాయిదా వేయించి, ఆ పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు పిలిచారు. మేం రెండు రోజులు రిహార్సల్స్ జరిపి, షూటింగ్ మొదలుపెట్టాం. తొలిసారి నేను సమంత చేత డాన్స్ చేయించాను" అని ఆయన చెప్పాడు. Also read: 'చిట్టి'తో షూట్ షురూ చేసిన 'రావణాసుర'!
సమంత, అల్లు అర్జున్ ఆ సాంగ్‌లో తమదైన స్టైల్‌తో సెన్సువాలిటీని తీసుకొచ్చారనీ ఆయన ప్రశంసించాడు. "సెన్సువాలిటీని చూపించడానికి రకరకాల విధానాలు ఉంటాయి. మోతాదు మించిన ఎక్స్‌పోజింగన్‌ను నేను నమ్మను. తన కాళ్ల మీద నుంచి ఒక స్త్రీ తన చీరను కొద్దిగా పైకి లేపినా, అది సెక్సీగా కనిపిస్తుంది. సెన్సువస్‌గా కనిపించడానికి యాటిట్యూడ్ చాలు. సమంత, అర్జున్ ఇద్దరూ ఆ సాంగ్‌లో తమ యాటిట్యూడ్‌ను చొప్పించారు. ఆ పాట అంత పాపులర్ కావడానికి అదే కారణమనుకుంటాను" అని చెప్పాడు గణేశ్ ఆచార్య. Also read: `పుష్ప - ద రైజ్` బాటలోనే `పుష్ప - ద రూల్`!
'ఊ అంటావా మావా' సమంత చేసిన ఫస్ట్ ఐటమ్ నంబర్ కావడం గమనార్హం. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్' 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ప్రస్తుతం దాని సీక్వెల్ 'పుష్ప: ది రూల్' నిర్మాణంలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



