English | Telugu
బాలయ్యతో పరశురామ్!?
Updated : Feb 2, 2022
`గీత గోవిందం`తో సంచలన విజయం అందుకుని.. టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించారు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో `సర్కారు వారి పాట` చేస్తున్నారాయన. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి కానుకగా మే 12న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట` తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నారు పరశురామ్. వేసవిలో చైతూ - పరశురామ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు. కాగా, నాగచైతన్య సినిమా లైన్ లో ఉండగనే ఓ సీనియర్ స్టార్ తో పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నారట పరశురామ్. ఆ స్టార్ మరెవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇటీవల బాలయ్యని సంప్రదించి పరశురామ్ ఓ ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించారట. అది నచ్చడంతో బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే బాలయ్య - పరశురామ్ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, తాజాగా `అఖండ`తో సంచలన విజయం అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఆపై అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తారు. అలాగే కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులతోనూ `లెజెండ్` స్టార్ జట్టుకట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. బాలయ్య మరోసారి వరుస చిత్రాలతో దూకుడు చూపించబోతున్నారన్నమాట.