English | Telugu
ఇండో - పాక్ వార్ నేపథ్యంలో `సలార్`?
Updated : Aug 16, 2021
`కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ - ఇండియా మూవీ `సలార్`. `కేజీఎఫ్` టీమ్ (హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం, రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ ఛాయాగ్రహణం)తోనే ప్రశాంత్ తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. `సలార్`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. యాక్షన్ సాగాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 70ల కాలంనాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోందట. అంతేకాదు.. రెట్రో మాస్ స్టోరీతో తయారవుతున్న ఈ సినిమాకి.. 1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధం బ్యాక్ డ్రాప్ అని సమాచారం. ఆ యుద్ధం చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారట. మరీముఖ్యంగా.. ఈ వార్ కి ప్రభాస్ రోల్ ని ముడిపెట్టిన విధానం చాలా కీలకమని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.
కాగా, `సలార్` చిత్రాన్ని 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.