English | Telugu

బ‌న్నీతో శైల‌జ‌..!

అల్లు అర్జున్ - లింగు స్వామి క‌ల‌యిక‌లో ఓ చిత్రం ఇటీవ‌లే లాంఛ‌నంగా మొద‌లైంది. డిజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌) పూర్త‌య్యాకే ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అయితే ఈలోగా క‌థానాయిక‌, సంగీత ద‌ర్శ‌కుడు, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం. బ‌న్నీ ప‌క్క‌న క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో తాజాగా నేను శైల‌జ ఫేమ్‌.. కీర్తి సురేష్ కూడా చేరింది. నిజానికి డీజే సినిమా కోసం కీర్తి సురేష్ పేరు అనుకొన్నారు. కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల‌... కీర్తీ రెడ్డి వ‌చ్చి చేరింది. లింగు స్వామి సినిమాకి మాత్రం కీర్తి సురేష్ కాల్షీట్ల కోసం ముందే క‌ర్చీఫ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. అమీ జాక్స‌న్ పేరు కూడా గ‌ట్టిగా వినిపిస్తోంది. అమీ పై హాట్ గాళ్ ముద్ర ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆక‌ట్టుకోవాలంటే కీర్తి సురేష్ లాంటి క‌థానాయికే బెట‌ర్ అని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. దాంతో పాటు కీర్తి ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కూ అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచ‌య‌మే. అతి త్వ‌ర‌లో క‌థానాయిక ఎవ‌రన్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కించే ఈ చిత్రం 2017 ఫిబ్ర‌వ‌రిలో మొద‌ల‌వుతుంది. యాక్ష‌న్ అంశాలు క‌ల‌గ‌లిపిన ఓ ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న‌ట్టు తెలుస్తోంది.