English | Telugu

విదేశాలకు రవితేజ..ట్రీట్‌మెంట్ కోసమేనా..?

గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించే మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య ఏమైందో తెలియదు గానీ అస్సలు పత్తా లేకుండా పోయాడు. అప్పుడేప్పుడో బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. వరుస పెట్టి కథలు వింటున్నా, ఏ కథ రవికి నచ్చడం లేదట. నయా మూవీతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే జాగ్రత్త కారణంగానే రవితేజకి ఎన్ని కథలు వినిపించినా ఎక్కడం లేదు. ఆ మధ్య దిల్‌రాజు బ్యానర్‌లో ఎవడో ఒకడు అనే సినిమాకు ఓకే చెప్పాడని, అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందనే గుసగుసలు వినిపించాయి.

తాజాగా రైటర్ విక్రమ్ సిరి దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాలో నటించబోతున్నాడని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందట. ఇదిలా ఉంటే మాస్ మహారాజా ట్రీట్‌మెంట్ కోసం ఫారిన్ వెళుతున్నాడన్న వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. బాడీ ఫిట్‌నెస్ బాగానే ఉన్నా..ఫేస్‌లో కళ తప్పడంతో రాబోయే సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు, మరింత అట్రాక్టివ్‌గా కనిపించేందుకు రిజువినేషన్ థెరపీ చేయించుకోవాలని రవి డిసైట్ అయ్యాడట అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లు వినిపిస్తోంది.