English | Telugu

బన్నీ, చెర్రీలు గుండాలుగా మారతారా...?

 

రాంచరణ్, అల్లు అర్జున్ ఇద్దరు "ఎవడు" చిత్రంలో నటించారు కానీ.. ఇద్దరు ఒకేసారి కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజాగా హిందీలో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ హీరోలుగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన "గూండే" చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అల్లు అరవింద్ ఆలోచనలో ఉన్నాడట. తెలుగు రీమేక్ లో బన్నీ, చరణ్ ఐతే బాగుంటుందని, సినిమా సూపర్ హిట్టవుతుందని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ రీమేక్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట అరవింద్. మరి ఈ ఆలోచన ఎప్పటికి అమలులోకి వస్తుందో చూడాలి.