English | Telugu

టాప్ హీరోల్ని మించిపోయిన అఖిల్‌

తొలి సినిమాతోనే అఖిల్ అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. మార్కెట్ ప‌రంగానే కాదు, పారితోషికం విష‌యంలోనూ అఖిల్ చ‌రిత్ర సృష్టించ‌బోతున్నాడు. అఖిల్ అరంగేట్రం కోసం రెండేళ్ల నుంచీ చిత్ర‌సీమ ఆస‌క్తిగా ఎదురుచూసింది. అఖిల్ ని వినాయ‌క్ చేతిలో పెట్టి... ఈ సినిమా మార్కెట్ ప‌రంగా మ‌రింత క్రేజ్ పెంచేశాడు నాగార్జున‌. ఈ ఎత్తుగ‌డ ఫ‌లించింది. ఇటు అఖిల్ క్రేజ్‌, అటు వినాయ‌క్ స్టామినా ఈ రెండూ అఖిల్ సినిమాకి కలిసొచ్చాయి. తొలి సినిమాకి రూ.50 కోట్లు సాధించ‌డం దాదాపు ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు కూడా లెక్క‌గ‌డుతున్నాయి.

మ‌రి ఈసినిమా కోసం అఖిల్ ఎంత పారితోషికం తీసుకొన్నాడ‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. అఖిల్ ఎంట్రీ అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా జ‌రిగితే పారితోషికం గురించిఎవ్వ‌రూ మాట్లాడ‌క‌పోయి ఉందురు. అయితే ఇది నితిన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమా.కాబ‌ట్టి.. పారితోషికం ఎంతోకొంత ఇచ్చుంటాడు. అదెంత‌?? అనే ఆస‌క్తి ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌లో నెల‌కొంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈసినిమా కోసం అఖిల్‌కి రూ.6 కోట్లు పారితోషికంగా అందించిన‌ట్టు టాక్‌. అదే నిజమైతే అరంగేట్ర సినిమాకి భారీ పారితోషికం అందుకొన్న హీరోగా అఖిల్ చ‌రిత్ర సృష్టించిన‌ట్టే.

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు... ఇలా బ‌డా బ‌డా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలంతా రూ.6 కోట్ల మైలురాయిని చేరుకొవ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. మెగా హిట్లు కొడితేగానీ.. ఆరు కోట్ల క్ల‌బ్‌లో చేర‌లేదు. అలాంటిది తొలిసినిమాకే ఆఖిల్ ఈ స్టాయిలో పారితోషికం అందుకొన్నాడంటే గ్రేటే క‌దా???