English | Telugu

టిక్కెట్ల రేట్లపై అల్లు అరవింద్ లాబీయింగ్

టిక్కెట్ల రేట్లపై అల్లు అరవింద్ లాబీయింగ్ చేస్తున్నారని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారం టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ మొదటి రెండు వారాల పాటి టిక్కెట్ల రేట్లను పెంచుకోటానికి అనుమతి కోసం అశ్వనీదత్, డి.సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చిలో కలిశారు. కానీ సినిమా టిక్కెట్ల రేట్లను మళ్ళీ పెంచుకోటానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదు.

కానీ ప్రస్తుతం తను తన కుమారుడు అల్లు అర్జున్ హీరోగా, వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా "బద్రీనాథ్" త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న కారణంగా ఆ సినిమాకి తొలి రెండు వారాల పాటు టిక్కెట్ రేటుని 75 రూపాయల వరకూ పెమచుకోవటానికి అనుమతి కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం ఆయన బావ చిరంజీవి కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఇలా టిక్కెట్ల రేట్లను పెంచుకోవటం ఆయనకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మీరేమంటారు...?