English | Telugu
అఖిల్ ను కింగ్ నాగార్జున మార్చగలడా..?
Updated : May 12, 2016
అక్కినేని వారి వారసుడు అఖిల్ కు కథలు ఓ పట్టాన నచ్చట్లేదట. ఎన్ని కథలు విన్నా, ఏదో వంక పెడుతున్నాడట. ప్రస్తుతం పూర్తి మాస్ హీరోగా మారిపోవాలని అఖిల్ ట్రై చేస్తున్నాడు. అందుకే వంశీ పైడిపల్లి ఎన్ని కథలు చెప్పినా అవన్నీ క్లాస్ గానే ఉన్నాయని నో చెబుతున్నాడట. దీంతో విసుగొచ్చిన వంశీ, ఫ్యామిలీతో సహా ఫారిన్ ట్రిప్ కు చెక్కేశాడట. అఖిల్ వ్యవహారం ఇలాగే ఉంటే, ఇక సినిమాలు చేయడం కష్టమే అని కింగ్ నాగార్జున ఫీలవుతున్నారని, అఖిల్ కు కథల విషయంలో క్లాస్ తీసుకుంటున్నారని సినీజనాలు అంటున్నారు. అఖిల్ చేసిన ఫస్ట్ సినిమా మాస్ ఎంటర్ టైనరే. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో చేసినప్పటికీ ఆ సినిమా ఘోరంగా దెబ్బ కొట్టింది. ఆ సినిమా తర్వాత నీకింకా ప్రపంచాన్ని కాపాడే వయసు రాలేదు అని నాగార్జున అన్నారని స్వయంగా అఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో కనీసం రెండో సినిమా అయినా, తన ఏజ్ కు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటాడని అందరూ భావించారు. ఇప్పుడున్న వయసుకు, బాడీకి అఖిల్ లవ్ స్టోరీలకు సెట్టవుతాడు తప్ప మాస్ స్టోరీలు అసలు కుదరవు. కానీ అఖిల్ కు మాత్రం దృష్టంతా మాస్ కథల మీదే ఉందట. కొడుకును మాస్ కథల మూడ్ నుంచి బయటకు తీసుకురావడమే ఇప్పుడు కింగ్ కు ఉన్న పెద్ద సవాల్.