English | Telugu
సమంత.. ఆ హీరోని పెళ్లాడబోతోందా?
Updated : May 12, 2016
నేను సింగిల్‌గా ఉన్నానని ఎవరు చెప్పారు?? అంటూ ఈమధ్యే మీడియాకు షాక్ ఇచ్చింది సమంత. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో కాస్త ఆచి తూచి మాట్లాడతారు. ఎంతమందితో డేటింగ్ చేస్తున్నా సరే.. 'అబ్బే అలాంటిదేం లేదండీ' అంటూ కవరింగ్ ఇస్తారు. కానీ... సమంత మాత్రం ధైర్యంగా తాను ఒంటరిని కాదన్న విషయం మీడియా ముందే.. ఒప్పుకొంది. సమంత ప్రేమాయాణాలు టాలీవుడ్‌కి తెలియనివి కావు. సిద్దార్థ్‌తో కొంతకాలం క్లోజ్‌గా ఉంది. ఆ తరవాత ఇద్దరు ఎవరికి వాళ్లే పేకప్ చెప్పేసుకొని విడిపోయారు. ఆమధ్య ఓ దర్శకుడితో సమంత క్లోజ్‌గా మూవ్ అవుతోందని వార్తలొచ్చాయి. ఆ విషయం ఎంత వరకూ నిజమో తెలీదుగానీ, సమంత ఈ విషయాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు.
అయితే ఓ హీరోతో సమంత చాలా.. క్లోజ్‌గా మూవ్ అవుతోందని, అది ప్రేమే అని, ఇద్దరూ పెళ్లి చేసుకొంటారన్న వార్తలు మాత్రం ఈమధ్య ఎక్కువయ్యాయి. ఆ హీరో.. స్టార్ కుటుంబం నుంచి వచ్చాడని క్లూలు కూడా ఇస్తున్నారు. సదరు హీరో కూడా తన ఇంట్లో 'సమంతనే చేసుకొంటా' అని స్ట్రాంగ్‌గా చెప్పేశాడట. ఆ నమ్మకంతోనే సమంత తన ప్రేమ గురించి మీడియా ముందు ఓపెన్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే తన మనసులో ఉన్న అతగాడి సంగతిని బయటపెట్టడం ఖాయమని, అందుకు ముందస్తుగా 'నేను సింగిల్ కాను' అనే హింట్ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సమంత మనసుదోచిన ఆ యంగ్ హీరో ఎవరో మీకైనా తెలుసా?. లేకపోతే సమంత నోరు విప్పేంత వరకూ ఆగాల్సిందే.