English | Telugu
సమంతకు త్వరలోనే పిల్లలు కావాలట..!
Updated : May 12, 2016
ఈ మధ్య సమంత పిల్లలతో ఎక్కువ టైం గడుపుతోంది. బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ లో సితారతో, జనతా గ్యారేజ్ సెట్లో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ తో, నీరజా కోన తనయుడితో చాలాసేపు సరదాగా టైం స్పెండ్ చేసింది సమంత. దీనికి ఒక కారణం ఏం చెప్పిందో తెలుసా..? తనకు పిల్లలు కావాలని అనిపిస్తోందట. తన తోటి వాళ్లందరూ హాయిగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేస్తుంటే, మనకెప్పుడు అని సమంతకు దిగులు పట్టుకుందట. అందుకే త్వరలోనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటోంది. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే, ఖచ్చితంగా హైదరాబాద్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను కానీ పేరు చెప్పను అంటూ ట్విస్ట్ ఇస్తోంది. ఇండస్ట్రీ వ్యక్తో కాదో తెలీదు కానీ, సమంత మాత్రం ఆల్రెడీ లవ్ లో ఉన్నమాట నిజమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహా అయితే ఇంకో రెండేళ్లు మాత్రమే సినిమాలు చేస్తాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతాను అని సమంత క్లియర్ గా చెప్పేయడం ఆమె ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే మరి.