Read more!

English | Telugu

ఐశ్వర్య అందం అసలు రహస్యం

అందమే అసలైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం రోజు రోజుకి రెట్టింపు అయితే ఆ వనితను ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అని అనాలేమో..
అంతటి అందం పోటీ పడితే, ప్రపంచ సుందరి కిరీటం కూడా ఓడింది.
అంతటి అందం ముందు నిలబడితే తాజ్‌మహల్ చిన్నబోయింది.
ఇండియా అంటే ఎవరెస్టు, తాజ్‌మహల్ ..... ఇంకా ఐశ్వర్య.
రెండు పదులప్పుడూ ప్రపంచసుందరి కిరీటం దాల్చిన ఐశ్వర్య ఆ కిరీటం దాల్చి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా అదే అందం, అంతకన్నా ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరి మతి పోగొడుతోంది. తాజాగా కెన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ మీద బంగారు చేపలా హొయలు ఒలకబోసిన ఐష్ ఒక్కసారిగా సౌందర్యాభిమానుల మనసులు చెదరగొట్టింది.


అంతటి అందాల సిరి నడిచి వస్తుంటే అక్కడ ఉన్న వారి రెప్ప వేయటం మానేసి, మనసులో ఐష్ రూపాన్ని ఖైదు చేసుకున్నారు. ఈ అతిలోక సౌందర్యవతి ఫోటోలు చూసిన  మరొకాయన మతిపోగొట్టుకోవటమే కాదు, రాత్రంతా నిద్ర పోగొట్టుకొన్నాను అని ట్వీట్ చేశారు. ఆయన ఎవరో కాదు ఐష్ భర్త అభిషేక్. కేన్స్‌కి ఐష్‌తో రాలేకపోయిన అభిషేక్ ఐష్‌ని చాలా మిస్ అవుతున్నాడట ఈ చిత్రాలు చూశాక.

ఏమైనా అమ్మ అయిన తర్వాత ఐశ్వర్య కూడా కాస్త బొద్దుగా తయారై, అమ్మయిన తర్వాత ఎంతటి అందగత్తె అయినా ఇంతే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐష్‌ని చూసిన వారంతా అందం తరగకుండా ఉండటానికి ఐశ్వర్య ఏం చేస్తుందే అనే రహస్యం తెలుస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఆడవారంతా.