English | Telugu
త్రిష అంత పని చేసిందా...??
Updated : Nov 18, 2014
త్రిష... సినిమాల్లేకపోయినా ఏదోలా ఈ పేరు వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. రానాతో త్రిష ఎఫైర్ నడుపుతోందని కొన్నాళ్లూ, కాదు వీళ్లు విడిపోయారని మరి కొన్నాళ్లు వార్తలువినవచ్చాయి. త్రిష ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని త్వరలోనే త్రిష సినిమాలకు బై బై చెప్పేసి, సంసార సాగరంలో మునిగిపోనుందని చెప్పుకొంటున్నారు. దానికి ఇంకాస్త పెప్ యాడ్ అయ్యిందిప్పుడు. అదేంటంటే... త్రిషకు పెళ్లి సెట్ అయిపోయిందట. అంతే కాదు.. గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని చెప్పుకొంటున్నారు. వరుణ్ మానియన్ అనే నిర్మాతని త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, వీరిద్దరికీ చెన్నైలో నిశ్చితార్థం జరిగిపోయిందని టాక్. ఈ వేడుకకు కేవలం కొంతమంది సన్నిహితులనే పిలిచిందట. ఈ యేడాది చివర్లో పెళ్లి ముహూర్తం ఖాయం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని స్వయంగా త్రిష మీడియా ముందు బయటపెట్టడానికి త్రిష సన్నాహాలు చేస్తోందట. తన చేతిలో రెండు సినిమాలున్నాయి. అవి పూర్తయ్యాకే పెళ్లి కబురు వినిపించాలని చూస్తోంది.