English | Telugu

షారుఖ్ కి జోడీగా నయనతార.. గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ!!

సౌత్ లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్స్ లో న‌య‌న‌తార ఒకరు. ముఖ్యంగా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు నయనతార బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైందని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి ఆమెకి క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌ గా తీసుకోవాల‌ని అట్లీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గతంలో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన రాజారాణి, బిగిల్ సినిమాలలో నయనతార నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నారట. మేకర్స్ కూడా నయనతారను తీసుకుంటే సౌత్ లో మూవీపై బజ్ వస్తుందని అనుకుంటున్నారట. నయనతార కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 'అన్నాత్తే' సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.