English | Telugu
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్!!
Updated : Jun 26, 2021
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్స్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ధనుష్ మరో టాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తొలిప్రేమ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. ఆ తరువాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక వెంకీ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ధనుష్ తో చేయనున్నాడట. ధనుష్ కోసం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా విభిన్న సినిమాలు చేస్తున్న ధనుష్.. ఈ సినిమాతో యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు సమాచారం.
మొత్తానికి కోలీవుడ్ స్టార్స్ చూపు టాలీవుడ్ పై పడింది. ధనుష్ తో పాటు మిగతా స్టార్స్ కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ మూవీ చేయనున్నాడు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి.