English | Telugu
నితిన్ కోసం ఊర్వశి చిందులు!?
Updated : Mar 6, 2022
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజకవర్గం` చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. నితిన్ కి జోడీగా `ఉప్పెన` భామ కృతి శెట్టి నటిస్తోంది. కేథరిన్ ట్రెసా ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న `మాచర్ల నియోజకవర్గం`కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. `మాచర్ల నియోజకవర్గం`లో కృతి, కేథరిన్ తో పాటు మరో భామ కూడా ఎంటర్టైన్ చేయనుందట. ఆమె మరెవరో కాదు.. 2015 `మిస్ దివా యూనివర్శ్` కిరీట సుందరి ఊర్వశి రౌటేలా. ఇప్పటికే ఉత్తరాదిన కొన్ని ప్రత్యేక గీతాల్లో చిందులేసిన ఊర్వశి.. `మాచర్ల నియోజకవర్గం`లోనూ ఓ స్పెషల్ డాన్స్ నంబర్ లో ఆడిపాడనుందట. త్వరలోనే `మాచర్ల నియోజకవర్గం`లో ఊర్వశి రౌటేలా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. ఊర్వశి చిందులు `మాచర్ల నియోజకవర్గం`కి ఏ మేరకు ప్లస్సవుతాయో చూడాలి.
కాగా, ఊర్వశి రౌటేలా కథానాయికగా నటించిన తెలుగు చిత్రం `బ్లాక్ రోజ్` త్వరలోనే జనం ముందుకు రానుంది. హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.