English | Telugu
ఫ్లాప్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. నిర్మాతగా `దిల్` రాజు!?
Updated : Mar 7, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్స్ లోకి రానుంది. ఈ లోపే వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు బాలయ్య.
ఇదిలా ఉంటే, తాజాగా మరో సినిమాకి కూడా బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. మ్యాచో స్టార్ గోపీచంద్ తో `వాంటెడ్` (2011), `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో `జవాన్` (2017) చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి రీసెంట్ గా బాలయ్యకి ఓ స్టోరీ చెప్పారట. అది నచ్చడంతో బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. అంతేకాదు.. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తారని వినిపిస్తోంది. త్వరలోనే బాలయ్య- బీవీఎస్ రవి - `దిల్` రాజు కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మరి.. దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న రవి.. బాలకృష్ణ కాంబినేషన్ తోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, పాపులర్ టాక్ షో `అన్ స్టాపబుల్` సమయంలో బాలయ్య, బీవీఎస్ రవికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ షోకి క్రియేటర్ గా పనిచేశాడు రవి.