English | Telugu

మ‌రోసారి సంక్రాంతి బ‌రిలో చిరు!?

వ‌రుస చిత్రాల‌తో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. త‌న త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించిన సోష‌ల్ డ్రామా `ఆచార్య‌` ఏప్రిల్ 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. `గాడ్ ఫాద‌ర్`, `మెగా 154`, `భోళా శంక‌ర్` చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మ‌రోవైపు `మెగా 156` ప్రి ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది.

ఇదిలా ఉంటే, `మెగా 154`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. 2023 సంక్రాంతి స్పెష‌ల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. `ప‌వ‌ర్`, `జై ల‌వ కుశ‌`, `వెంకిమామ‌` చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ రూపొందిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు వింటేజ్ లుక్ లో మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే `మెగా 154` రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, చిరంజీవి ఇప్ప‌టికే పలుమార్లు సంక్రాంతి సీజ‌న్ లో త‌న చిత్రాల‌తో సంద‌డి చేశారు. అనేక ఘ‌న‌విజ‌యాలు చూశారు. చివ‌రిసారిగా త‌న రి-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` (2017)తో ముగ్గుల పండ‌క్కి మురిపించారు చిరు.