English | Telugu
విజయ్.. వరుసగా మూడోసారి అతనితోనే?
Updated : May 27, 2021
`మాస్టర్`తో తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్. ప్రస్తుతం `కోలమావు కోకిల` (తెలుగులో `కోకోకోకిల` పేరుతో అనువాదమైంది) ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 65వ చిత్రం చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. కాగా, విజయ్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన జూన్ 22న రాబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నట్లు టాక్. విజయ్ గత చిత్రం `మాస్టర్`తో పాటు ప్రస్తుతం చేస్తున్న `విజయ్ 65`కి కూడా అనిరుధ్ నే స్వరకర్త. మొత్తమ్మీద.. వరుసగా మూడోసారి అనిరుధ్ కి విజయ్ ఛాన్సివ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీలో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా, విజయ్ - అనిరుధ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `కత్తి` (2014), రెండో సినిమా `మాస్టర్`.. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాబోయే ప్రాజెక్టులపైనా అంచనాలు నెలకొని ఉన్నాయి.