English | Telugu
తారక్ ఫ్యాన్స్ కి నిరాశ.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' లేనట్టేనా?..
Updated : May 27, 2021
'బిగ్ బాస్' షోతో అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో బుల్లితెరపై మరోసారి హంగామా చేస్తారని అంతా భావించారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. నిజానికి ఈ షో ఈ నెల నుంచి టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుంది? అని చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కరోనా ఉధృతి తగ్గినట్లు అయితే ఆగస్టు నెల నుంచి ఈ షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ కరోనా ఉధృతి తగ్గకపోతే ఈ ఏడాది పూర్తిగా షో నిలిపి వేసే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే కరోనా ఉధృతి తగ్గితే ఎన్టీఆర్ ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశముంది. మరోవైపు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసి షూటింగ్ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయడం అనేది చాలా రిస్క్ అని భావిస్తున్న నిర్వాహకులు.. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంది.