English | Telugu
ఎన్టీఆర్-కొరటాల మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల!
Updated : Oct 29, 2021
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో భారీగా బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా 'పెళ్లిసందD' ఫేమ్ శ్రీలీల పేరు వినిపిస్తోంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నట్లుగానే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పాన్ ఇండియా మూవీ కావడంతో.. ఇందులో బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్ లేదా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశముందని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తోంది.
'పెళ్లిసందD' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల యూత్ లో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్న ఆమెకు టాలీవుడ్ నుంచి బాగానే ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ 'ధమాకా'లో హీరోయిన్ గా ఎంపికైందని న్యూస్ రాగా.. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్-కొరటాల మూవీలో ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తున్న సినిమాలో.. స్టార్ హీరోయిన్స్ కి బదులుగా శ్రీలీలను ఎంపిక చేశారన్న వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.