English | Telugu
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్.. టైటిల్ ఏంటంటే?
Updated : Oct 27, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడు. వీటి తర్వాత ఎన్టీఆర్ మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్- సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో సినిమా రానుందని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు ఏ అప్డేట్ లేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా రానుందంటూ మరోసారి వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ కోసం సంజయ్ లీలా భన్సాలీ పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి 'జై బావ్ రే' అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్- సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దేవదాస్, బాజీరావ్ మస్తానీ, రాంలీలా, పద్మావత్ వంటి సంచలన సినిమాలను అందించిన భన్సాలీ.. ఎన్టీఆర్ తో కలిసి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.