English | Telugu

యన్ టి ఆర్ 'శక్తి' ఓవర్ సీస్ రైట్స్ 2 కోట్లకు

యన్ టి ఆర్ 2 కోట్లకు 'శక్తి' ఓవర్ సీస్ రైట్స్ అమ్ముడు పోయాయని తెలిసింది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న "శక్తి" చిత్రం ఓవర్ సీస్ హక్కులు సుమారు రెండు కోట్లకు అమ్ముడుపోయాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. యన్ టి ఆర్ 'శక్తి' ఓవర్ సీస్ రైట్స్ ను ఫికాస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సుమారు రెండు కోట్లకు సొంతం చేసుకుందని వినికిడి.

ఇప్పటి వరకూ యన్ టి ఆర్ సినిమాల్లో ఓవర్ సీస్ కి వన్ ఆఫ్ ది హైయ్యెస్ట్ ఎమౌంట్ కలెక్ట్ చేసిన మూవీగా "శక్తి" చిత్రాన్ని చెప్పుకోవచ్చు. మార్చ్ 30 వ తేదీన, ఇండియాతో పాటే ఓవర్ సీస్ లో కూడా యన్ టి ఆర్ 'శక్తి' విడుదలవుతుందని ఈ చిత్రం యూనిట్ తెలియజేసింది. యన్ టి ఆర్ ద్విపాత్రాభినయం, ఇలియానా అందచమదాలు, మణిశర్మ సంగీతమ, మెహేర్ రమేష్ దర్శకత్వ ప్రతిభ కలగలసి ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తాయని ఈ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ బలంగా నమ్ముతున్నారట.