English | Telugu
మహేశ్.. `మురారి బావ`!?
Updated : Apr 11, 2022
కెరీర్ ఆరంభంలో `మురారి` (2001)గా మురిపించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్వరలో `మురారి బావ`గానూ ఎంటర్టైన్ చేయనున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. `భరత్ అనే నేను` (2018), `మహర్షి` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020) వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మహేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కేరళకుట్టి కీర్తి సురేశ్ సందడి చేయనుంది. కాగా, యువ సంగీత సంచలనం తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన ``కళావతి``, ``పెన్నీ`` పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచిన నేపథ్యంలో.. ఈ సినిమా తాలుకూ థర్డ్ సింగిల్ పై సర్వత్రా ఎనలేని ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలో విడుదల కానున్న ఈ గీతం ``మురారి బావ`` అంటూ సాగే పదాలతో మొదలు కానుందట. మహేశ్, కీర్తిపై చిత్రీకరించిన ఈ యుగళ గీతం సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `మురారి`గా మురిపించిన మహేశ్ ``మురారి బావ``గానూ మైమరిపిస్తాడేమో చూడాలి. కాగా, వేసవి కానుకగా మే 12న `సర్కారు వారి పాట` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.