English | Telugu
తారక్ తో దీపిక రొమాన్స్!?
Updated : Apr 11, 2022
`ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. త్వరలో విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నాడు తారక్. ఇది కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గానే రూపొందనుంది. ఆపై `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `ఎన్టీఆర్ 31` చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కూడా పాన్ - ఇండియా మూవీనే.
ఇదిలా ఉంటే, కొరటాల కాంబినేషన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో రొమాన్స్ చేయనున్న తారక్.. ఆపై ప్రశాంత్ నీల్ డైరెక్టోరియల్ కోసం కూడా మరో బాలీవుడ్ యాక్ట్రస్ తో జట్టుకట్టనున్నాడట. ఆమె మరెవరో కాదు.. స్టార్ బ్యూటీ దీపికా పదుకోణ్. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కె`లో నటిస్తున్న దీపిక.. సదరు పాన్ - వరల్డ్ మూవీతోనే టాలీవుడ్ లో తొలి అడుగేస్తోంది. ఒకవేళ తారక్ - ప్రశాంత్ కాంబో మూవీలో దీపిక కన్ఫామ్ అయితే ఆమెకది రెండో తెలుగు చిత్రమవుతుంది. త్వరలోనే `ఎన్టీఆర్ 31`లో దీపికా పదుకోణ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. తారక్ - దీపిక జోడీ ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.